- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహా డేంజర్.. ఆర్టీసీపై కరోనా పంజా
దిశ, తెలంగాణ బ్యూరో : మహారాష్ట్ర సరిహద్దుల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా వస్తోంది. ఆర్టీసీ కార్మికులు అత్యధికంగా ఈ సరిహద్దుల్లో బలవుతున్నారు. రాష్ట్రం నుంచి మహారాష్ట్ర సరిహద్దులకు బస్సులు నడిపే 320 మందికిపైగా కార్మికులకు కరోనా పాజిటివ్ తేలింది. ఈ రెండు రోజుల వ్యవధిలోనే మరిన్ని కేసులు నమోదయ్యాయి. శనివారం నుంచి ఆదివారం వరకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆరు డిపోల్లో 165 మందికి పాజిటివ్ వచ్చింది. వీరంతా బోధన్ బార్డర్‌గా మహారాష్ట్రకు ఆర్టీసీ బస్సులు నడిపిన డ్రైవర్లు, కండక్టర్లే.
అదేవిధంగా నాగపూర్ వైపు బస్సులు నడిపించిన 155 మందికిపైగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఆర్టీసీ కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంచిర్యాల డిపోలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. ఆదిలాబాద్ డిపోలో శనివారం నుంచి ఆదివారం వరకు ఒకేరోజు 48 మందికి పాజిటివ్ తేలింది. వీరు కూడా మహారాష్ట్రకు నాగపూర్ బోర్డర్ నుంచి బస్సులు నడిపిన ఆర్టీసీ కార్మికులు.
వీరితో పాటుగా గతంలోనే దాదాపుగా 300మందికిపైగా కార్మికులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులను మహారాష్ట్ర వైపు ఇంకా నడిపిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ నుంచి బోధన్ బార్డర్‌గా ఔరంగాబాద్, నాంధేడ్, అమరావతితో పాటు ఇతర ప్రాంతాలు, ఆదిలాబాద్ నుంచి నాగపూర్ బార్డర్‌గా చంద్రాపూర్ వంటి ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ సిబ్బందికి పాజిటివ్‌గా తేలుతోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో బస్సులు ఆపాలని గతంలోనే డిమాండ్‌చేశారు. కానీ ఆర్టీసీ మాత్రం కేవలం ట్రిప్పులు కుదించి యధావిధంగానే సర్వీసులు కొనసాగిస్తోంది. దీంతో కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి.