RTC చైర్మన్ బాజిరెడ్డి సంచలన నిర్ణయం.. స్వాగతించిన సజ్జనార్

by Anukaran |
RTC Chairman Bajireddy Govardhan, sajjanar
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ నుంచి చైర్మన్ హోదాలో తనకు వచ్చే వేతనాన్ని వదులుకున్నారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు బుధవారం లేఖ అందజేశారు. శాసనసభ్యునిగా తనకు వస్తోన్న జీతం చాలని, TSRTC నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఆర్థికభారం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. చైర్మన్ హోదాలో వేతనం వదులుకున్న బాజిరెడ్డి నిర్ణయాన్ని ఆర్టీసీ అధికారులు, సూపర్ వైజర్లు, ఉద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేశారు.

RTC Chairman Bajireddy Govardhan, sajjanar

Advertisement

Next Story