ఆర్టీసీ బస్సు బైక్ ఢీ.. ఇద్దరు మృతి

by Shyam |   ( Updated:2020-12-26 09:16:13.0  )
ఆర్టీసీ బస్సు  బైక్ ఢీ.. ఇద్దరు మృతి
X

దిశ, హుజురాబాద్: ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన హుజురాబాద్‌లో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసుల వివరాల ప్రకారం..వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన కడారి సదానందం (34), ఆయన కుమారుడు కడారి కమల్ (9)లు పనులు ముగించుకొని శనివారం ఇంటికి బయలు దేరారు. కాగా దామెర గ్రామ శివారులో వారి బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

దీంతో సదానందం కమల్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story