ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో డ్రైవర్‌కు ఫిట్స్..

by Sridhar Babu |
ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో డ్రైవర్‌కు ఫిట్స్..
X

దిశ, మానకొండూరు : హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చింది. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామశివారులో అనుకోకుండా ఫిట్స్ రావడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టుకు ఢీకొట్టింది. ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్ రెడ్డి కథనం ప్రకారం.. రాణిగాంజ్-2 డిపోకు చెందిన(టీఎస్‌ 09 జెడ్ 7611) బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు బయలుదేరింది. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్దకు రాగానే మధ్యాహ్నం 1.30 గంటలకు బస్‌డ్రైవర్‌ రామావత్ అంజయ్యకు ఫిట్స్‌ వచ్చింది.

దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్ళి చెట్టుకు ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో 13 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం డ్రైవర్‌ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed