RSS చీఫ్‌కు మోహన్ భగవత్‌కు కరోనా.. టీకా తీసుకున్నప్పటికీ..!

by vinod kumar |   ( Updated:2021-04-09 23:50:28.0  )
RSS చీఫ్‌కు మోహన్ భగవత్‌కు కరోనా.. టీకా తీసుకున్నప్పటికీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా నిర్దారణ అయ్యింది. కొవిడ్ లక్షణాలు ఉండటంతో ఆయన తాజాగా టెస్టులు చేయించుకోగా శుక్రవారం పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన నాగపూర్‌లోని కింగ్స్ వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా, కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న నెల తర్వాత ఆయనకు కరోనా సోకడం గమనార్హం.

మార్చి 6వ తేదీన నాగపూర్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో మూడో దశ వ్యాక్సినేషన్ ట్రయల్స్‌లో భాగంగా మోహన్ భగవత్ టీకా తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కరోనా టీకా తీసుకున్న వారంలో వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story