- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలో ఆలస్యం!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకెండ్ వేవ్‌తో పాటు ఇతర సమస్యల కారణంగా ఆరోగ్య రంగంపై తీవ్రంగా ప్రభావం పడటంతో బీమా క్లెయిమ్‌ల విషయంలో ఆలస్యం అవుతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పరిశ్రమ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీమా సంస్థల వద్ద దాఖలైన రూ. 15,700 కోట్ల విలువైన కొవిడ్-19 క్లెయిమ్‌లలో గత నెల ఏప్రిల్ చివరి నాటికి 57 శాతం అంటే రూ. 9,000 కోట్లు మాత్రమే పరిష్కరించబడ్డాయి. మార్చి నాటికి పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల విలువ రూ. 6,660 కోట్లతో పోలిస్తే ఏప్రిల్ చివరి నాటికి రూ. 6,700 కోట్ల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే, మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో బీమా కంపెనీల వద్ద దాఖలైన కరోనా క్లెయిమ్‌ల సంఖ్య 22 శాతం పెరిగాయని పరిశ్రమ వర్గాలు వివరించాయి. ముఖ్యంగా నగరు రహిత క్లెయిమ్‌ల విషయంలో పాలసీదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరోక పెద్ద సవాలు..క్లెయిమ్‌ల మొత్తంలో కొద్ది భాగాన్ని మాత్రమే అందుకోగలుగుతున్నారు. పాలసీదారులకు మొత్తం బిల్లుల్లో 50 శాతం మాత్రమే వచ్చిన అనేక కేసులున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.