RRR: షూటింగ్ షురూ.. అతడితో కలిసి సెట్లో చరణ్

by Shyam |   ( Updated:2021-06-21 01:46:57.0  )
RRR shoots starts after lock down
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్రపరిశ్రమ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో జక్కన నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకోగా మరో 10 శాతం బ్యాలెన్స్ ఉంది. ఇక ఈ సమయంలోనే కరోనా లాక్ డౌన్ ప్రకటించడంతో షూటింగ్ ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇటీవలే కరోనా ఆంక్షలు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ని షురూ చేసింది.

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో నిలిచిపోయిన ఈ సినిమా చిత్రీకరణను సోమవారం హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించారు. స్ట్రిక్ట్ గా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చరణ్ కోసం ముంబై నుంచి వచ్చిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ కన్ఫర్మ్ చేశారు. చరణ్ తో కలిసి దిగిన ఓ ఫోటోను ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలో చరణ్ సీతారామరాజు లుక్ లో అదిరిపోయాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి చరణ్ తో షూటింగ్ స్టార్ట్ చేసిన జక్కన్న తారక్ ని ఎప్పుడు రంగంలోకి దింపుతాడో చూడాలి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న అలియా జూలై 1 నుండి ఈ షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం. ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ‘ఈ చిత్రంలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story