అదరగొట్టిన రాజస్థాన్.. బెంగళూరు టార్గెట్ @178

by Shyam |   ( Updated:2021-04-22 10:35:48.0  )
Rajasthan Royals
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో శివమ్‌ దూబే(46), రియన్‌ పరాగ్‌(25)తో కలిసి ఇన్నింగ్స్‌ను స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 109 పరుగుల వద్ద పరాగ్‌ ఔటైనా.. తర్వాత క్రీజులో వచ్చిన రాహుల్‌ తెవాటియా(40) రాణించాడు. అయితే దూబే, తెవాటియాలు వెనుదిరిగిన తర్వాత రాజస్తాన్‌ పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌ చెరో 3 వికెట్లు తీయగా.. జేమిసన్‌, రిచర్డ్‌సన్‌, సుందర్‌లు తలా ఒక వికెట్‌ తీసింది. అంతకముందు రాజస్థాన్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం రాజస్తాన్‌ స్కోరు 170/9గా ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎదుట 178 పరుగులు లక్ష్యాన్ని పెట్టింది.

Next Story

Most Viewed