- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదేళ్ల బాలుడు @2800 కి.మీ పాదయాత్ర!
దిశ, వెబ్‌డెస్క్ : ఒకరి మీద అమితమైన ప్రేమ ఉందంటే, వారికోసం ఏం చేసేందుకైనా వెనుకాడం. అలానే ఓ పదేళ్ల బాలుడికి వాళ్ల అమ్మమ్మంటే ఎంతో ప్రేమ. అందరిలానే సెలవులు వస్తే.. ఫ్యామిలీతో కలిసి ఆ బాలుడు అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాడు. ఈసారి కరోనా కారణంగా సెలవులు ముందే వచ్చాయి కానీ, అమ్మమ్మను కలిసే వీలు లేకుండా పోయింది. అప్పటికే తను అమ్మమ్మను హత్తుకుని, ఆమె చెప్పే కథలు విని ఏడాది దాటింది. దీంతో ఆ బాలునికి అమ్మమ్మను ఎలాగైనా కలుసుకోవాలనిపించింది. వెంటనే బ్యాగులో బట్టలు సర్దుకున్నాడు. అమ్మనాన్నలకు చెప్పి కాలి నడకన అమ్మమ్మ దగ్గరకు బయలుదేరాడు. ఇందులో విశేషమేముంది అంటారా? అతడు నడిచింది.. పదో, పాతిక కిలోమీటర్లో కాదు. ఏకంగా 2800 కిలోమీటర్లు నడిచి అమ్మమ్మను చేరుకున్నాడు.
రోమియో కాక్స్ లండన్‌లో జన్మించినా, కుటుంబంతో సహా సిసిలిలోని పలెర్మోలో ఉంటున్నాడు. ప్రతి వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్లే రోమియో.. కరోనా వైరస్ విజృంభణతో ఈ ఏడాది వెళ్లలేకపోయాడు. అయితే అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదని తనకు తెలియడంతో ఎలాగైనా చూడాలనుకున్నాడు. లండన్‌లో ఉంటున్న ఆమెను నడుచుకుంటూ వెళ్లి కలుస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. చేసేదేం లేక.. రోమియోకు తోడుగా వాళ్ల నాన్న ఫిల్ (జర్నలిస్ట్, డాక్యుమెంటరీ మేకర్) కూడా జతయ్యాడు. ఇద్దరూ కలిసి జూన్ 20న నడక ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల మీదుగా యూకే చేరుకున్నారు. రెండు నెలల పాటు కాలినడకన ప్రయాణించి ఎట్టకేలకు సెప్టెంబర్ 21న గమ్యస్థానం చేరకున్నారు.
ఫిల్ డాక్యుమెంటరీ మేకర్ కావడంతో.. తమ జర్నీ విశేషాలను ఓ డాక్యుమెంటరీగా తీశాడు. అలాగే, ఎప్పటికప్పుడు తమ జర్నీ విశేషాలు, ఫోటోలను తమ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. వీరు తమ నడకకు సామాజిక అంశాన్ని కూడా మేళవించి, దీని ద్వారా ఫండ్ రైజ్ చేశారు. అలా సేకరించిన. రూ.11.4 లక్షల మొత్తాన్ని రిఫ్యూజీ ఎడ్యుకేషన్ అక్రాస్ ట్రస్ట్ (REACT) చారిటబుల్ అసోసియేషన్‌కు ఇవ్వనున్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులను దాటామని, ఎంతో అద్భుతమైన జర్నీ అని, అయితే.. చర్చి, కాన్వెంట్స్, హాస్టల్స్‌తో పాటు కొన్నిసార్లు మాత్రం ఎంతో భయంకరమైన ప్రదేశాల్లో నిద్రపోవాల్సి వచ్చిందన్నారు.
అధికారులు ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. అది పూర్తికాగానే రోమియో తన అమ్మమ్మను కలుసుకోవచ్చు. ‘ఐసోలేషన్ పూర్తి కాగానే.. అమ్మమ్మను వెళ్లి హగ్ చేసుకుంటా.. అదే నా అచీవ్‌మెంట్’ అని రోమియో అన్నాడు.