ముగ్గురితో రొమాన్స్.. పెళ్లి?

by Anukaran |
Kissing
X

దిశ, సినిమా : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఆడపిల్లకు భర్తను ఎంచుకునే స్వేచ్ఛ మాత్రం రాలేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కో సంబంధం తీసుకొస్తే అందులో నుంచి ఏదోఒకటి ఎంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కొన్ని సందర్భాల్లో అసలు ఈ ఆప్షన్ కూడా ఉండదు. మంచి కుటుంబం.. పిల్లాడు బాగా సెటిల్ అయ్యాడు.. వంటి కారణాలతో అమ్మాయిని కన్విన్స్ చేసి, తనకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసి చేతులు దులుపుకుంటారు. ఇలాంటి కాన్సెప్ట్‌కు కాస్త వెస్ట్రన్ కల్చర్ యాడ్ చేస్తూ, బోల్డ్‌ టచ్‌ ఇచ్చిన కాంట్రవర్షియల్ సిరీస్‌.. ‘ఏ సూటబుల్ బాయ్’.

ఫ్యామిలీ మెంబర్స్ సెలెక్ట్ చేసిన ముగ్గురు వేర్వేరు వ్యక్తుల్లో ఒకరిని పార్టనర్‌గా ఎంచుకునే క్రమంలో సాగే 19 ఏళ్ల అమ్మాయి ఎమోషనల్ అండ్ రొమాంటిక్ జర్నీనే స్టోరీ లైన్. విక్రమ్ సేత్ నవల ఆధారంగా తెరకెక్కిన సిరీస్‌లో తమను తాము డిస్కవర్ చేసుకునేందుకు యంగ్ నేషన్ చేస్తున్న పోరాటం సరైందా? కాదా? లైఫ్ లాంగ్ పేరెంట్స్ డెసిషన్ మీదే ఆధారపడాలా లేక ఇండిపెండెంట్‌గా దూసుకుపోవాలా? అనే అంశాన్ని చర్చిస్తూనే.. ‘ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరూ ఎస్టిమేట్ చేయలేరు. ఎలాంటి సందర్భాల్లో అయినా ఓన్ హార్ట్‌ను ఫాలో కావడమే బెటర్. బౌండరీస్‌కు మించి ప్రేమే మనల్ని ముందుకు పుష్ చేస్తుంది’ అనే నమ్మకాన్ని కలిగించడంలో సక్సెస్ అయింది.

a suitable boy2

ముగ్గురితో సాన్నిహిత్యం..

19 ఏళ్ల లక్కీ గర్ల్ లత(తాన్యా) చుట్టూనే ‘ఏ సూటబుల్ బాయ్’ కథ తిరుగుతుంది. తండ్రి పోవడంతో ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకుల జీవితం గురించి ప్రతీక్షణం ఆలోచించే తల్లి.. పిల్లలకు జీవితభాగస్వామి ఎంపికలో నిర్ణయం తనదైతేనే సంతోషంగా ఉంటారని అనుకుంటుంది. ఈ మేరకు బనారస్‌లో లత అక్క పెళ్లితో సిరీస్ స్టార్ట్ కాగా.. ఆ క్షణం నుంచే లతకు కూడా సూటబుల్ బాయ్‌ను వెతికేపనిలో పడుతుంది. మ్యారేజ్ బ్యూరోలు, తెలిసిన బంధువులకు చెప్పడంతో పాటు పెద్ద కొడుకుకు ఈ బాధ్యత గురించి గుర్తుచేస్తుంది. ఆ తర్వాత లత హైయ్యర్ స్టడీస్ కోసం తన అక్కతో పాటు కలకత్తా వెళ్తుంది.

ఈ క్రమంలో యూనివర్సిటీలో కబీర్ అనే ముస్లిం యువకుడితో ప్రేమలో పడుతుంది. అదే సమయంలో ఇంట్లో సంబంధాలు చూస్తుండటంతో మరోచోటుకు పారిపోదామని కబీర్‌ను అడుగుతుంది. కానీ లైఫ్‌లో సెట్ కాకుండా ఇలా చేయడం సరికాదని అతను సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా.. కోపంతో మళ్లీ బనారస్ వెళ్తుంది. అక్కడకు వెళ్లాక వదిన తమ్ముడికి(అమిత్) ఇచ్చి పెళ్లి చేసేందుకు సోదరుడు ప్రయత్నిస్తాడు. అమిత్ ఒక పాపులర్ ఇంగ్లీష్ పొయెట్ కాగా.. అన్నావదినలు చూజ్ చేసిన తనతోనూ సన్నిహితంగా మెలుగుతుంది. ఇక తల్లి హరేశ్ అనే మరో అబ్బాయిని వెతికి పట్టుకుంది. 15ఏళ్లకే పెళ్లంటే ఇంటి నుంచి పారిపోయిన వ్యక్తి స్వతహాగా ఎదిగిన తీరుతో ఇంప్రెస్ అయిన తల్లి.. తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతుంది. ఈ క్రమంలో తనను మీట్ కావడం, అప్పటికే లవ్ ఫెయిల్యూర్ అయిన హరేశ్ లతను మనస్ఫూర్తిగా ఇష్టపడటం జరుగుతుంది. దీంతో తనతోనూ ఓ లవ్ ట్రాక్ నడిపిస్తుంది లత. ఫైనల్‌గా ఇటు తల్లి మాట వినాలా? అన్నావదినలను ఫాలో అయిపోవాలా? లేక తను ప్రేమించిన వ్యక్తికే ఓకే చెప్పాలా? ఈ ముగ్గురిలో ఎవరిని ఎందుకు ఎంచుకుంది? అనే రొమాంటిక్ జర్నీని కన్విన్సింగ్‌గా చూపించారు మేకర్స్.

a suitable boy

ప్రేమకు వయసుతో సంబంధం లేదు..

మరోవైపు లత అక్క మరిది అయిన మాన్ (ఇషాన్ ఖట్టర్).. పాపులర్ పొలిటీషియన్ కొడుకైనా సరే, బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు. హోళి సందర్భంగా ఇంట్లో ఏర్పాటు చేసిన భోగం మేళాలో సాయిదా బాయి(టబు) పాటకు ఇంప్రెస్ అయిన మాన్.. తల్లి వయసున్న తనతో ప్రేమలో పడతాడు. మహల్ చుట్టూ తిరుగుతూ 24 గంటలు ఆమె ధ్యాసలోనే గడుపుతుంటాడు. ఈ ఎపిసోడ్ ద్వారా ప్రేమకు వయసుతో సంబంధం లేదనే మెసేజ్ ఇచ్చింది ‘ఏ సూటబుల్ బాయ్’.

మతం కాదు స్నేహమే కాపాడుతుంది..

బాబ్రీ మసీదు కూల్చివేత బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన సిరీస్‌లో హిందువైన మాన్.. అల్లర్ల సమయంలో తన ముస్లిం స్నేహితుడు ఫిరోజ్ అలీఖాన్‌ను కాపాడుకునే విధానాన్ని డైరెక్టర్ మీరా నాయర్ చక్కగా చూపించింది. అనుకోని పరిస్థితుల్లో మాన్‌ తన స్నేహితుడిపైనే మర్డర్ అటెంప్ట్ చేసినా.. ఫిరోజ్‌ మాత్రం కోర్టులో అబద్దం చెప్పి తనను సేవ్ చేయడం ద్వారా ఫ్రెండ్‌షిప్ గొప్పతనం గురించి వివరించాడు. దీంతో పాటు హిందూముస్లిం మధ్య సోదరభావం ఉంటే ఎలా ఉంటుంది? ఇతర మతాలను ద్వేషిస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి? అనేది చూపించారు.

Advertisement

Next Story

Most Viewed