ఫెదరర్ మళ్లీ వస్తున్నాడు..!

by Anukaran |
ఫెదరర్ మళ్లీ వస్తున్నాడు..!
X

దిశ, స్పోర్ట్స్ : టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఏడాది తర్వాత రాకెట్ పట్టుకోబోతున్నాడు. గత కొన్ని నెలలుగా టెన్నిస్ కోర్టుకు దూరంగా ఉన్న ఫెదరర్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడబోతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆల్ టైం గ్రేట్ ప్లేయర్స్‌లో ఒకడిగా ఉన్న రోజర్ ఫెదరర్ ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్‌లలో చాంపియన్‌గా నిలిచాడు. ఈ ఏడాది గాయం బాధించడంతో పాటు కరోనా కారణంగా టెన్నిస్‌కు దూరమయ్యాడు. దీంతో రఫేల్ నదాల్ ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి రోజర్ ఫెదరర్ సరసన నిలిచాడు. కాగా, ఫెదరర్ ఈ ఏడాదిలో టెన్నిస్ కోర్టు చూడలేదు. దీంతో అతడి కెరీర్ ముగిసిందని అందరూ భావించారు.

అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఫెదరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడటానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ అయిన ఆస్టేలియన్ ఓపెన్ ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం కానుంది. దీంట్లో ఫెదరర్ పాల్గొననున్నట్లు టోర్నీ నిర్వాహక కమిటీ చీఫ్ క్రెగ్ టైలీ వెల్లడించారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ కరోనా కారణంగా 50 శాతం మంది ప్రేక్షకుల సమక్షంలోనే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ టోర్నీని ఏటీపీ తమ క్యాలెండర్‌లో చేర్చింది.

Advertisement

Next Story