రోబోడాగ్స్ రూటే వేరు..

by Sujitha Rachapalli |
రోబోడాగ్స్ రూటే వేరు..
X

దిశ, వెబ్ డెస్క్ : పెంపుడు జంతువులంటే ఎవరికి ఇష్టం ఉండదు .. చాలా మంది తమ ఇళ్లలో పెంపుడు జంతవులను పెంచుకుంటారు. ఎక్కువగా కుక్కను పెంచుకుంటారు. దానికి మంచి మంచి పేర్లు పెట్టి మన ఇంటి మనిషి లానే చూసుకుంటాం. ఆ మూగ జీవాలు కూడా మన రక్షణకు ఎంతగానో ఉపయోగ పడుతుంటాయి. అయితే పెద్దలంటారు ఇంట్లో కుక్కను పెంచుకుంటే ఎవరూ రారు, దొంగలను పట్టిస్తుంది అలానే దుష్టశక్తి లాంటిది వచ్చినా దానికే ముందు తెలుస్తుంది అని అనేవారు కానీ అందులో ఎంత నిజం ఉందో తెలియదు.
అయితే ఇప్పుడు ఈ పెంపుడు జంతువులని రోబోలతో భర్తి చేయనున్నారంటా.. ఆశ్చర్యంగా ఉంది కదా …అవును మన ఇంటికి కాపలాగా ఉండేందుకు ఇప్పడు రోబోడాగ్స్ రానున్నాయి. కెనడాకు చెందిన ఆల్బార్టా షెల్ రిఫైనరీ కంపెనీ స్పాట్ అనే రెండు రోబో డాగ్ లను కాపాలా ఉద్యోగులుగా ఉంచుకున్నాయి. అయితే ఆకంపెనీలో అత్యంత ప్రమాదకరమైన పనులను ఈ రోబో డాగ్ లు చూస్తాయంటా వీటివలన ప్లాంట్ కు ప్రాణనష్టం తక్కువని భావించి వీటిని పెట్టుకున్నారంటా. ఈ రోబో డాగ్ లను అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ అనే సంస్థ రూపొందించింది. వీటి ధర సుమారు లక్ష డాలర్ల ఉంటుందంటా.

Advertisement

Next Story