నగరాభివృద్ధిలో భాగంగా అన్ని డివిజన్లలో రోడ్లు: మంత్రి పువ్వాడ

by Sridhar Babu |
నగరాభివృద్ధిలో భాగంగా అన్ని డివిజన్లలో రోడ్లు: మంత్రి పువ్వాడ
X

దిశ, ఖమ్మం: ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్ లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు గాను సీసీ రోడ్స్ నిర్మిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం 53వ డివిజన్ NST రోడ్ నందు రూ.30 లక్షలు, 26వ డివిజన్ పోలీస్ కమిషనర్ కార్యాలయం రోడ్ నందు రూ.13 లక్షలు మొత్తం రూ.43 లక్షలతో నిర్మించిన రోడ్స్‌ను మేయర్ పునుకొల్లు నీరజ గారితో కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు(ఎస్ డీఎఫ్) రూ.30 కోట్ల నిధుల నుండి 41 డివిజన్ లో 140 రోడ్స్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని పిడిఎఫ్ రోడ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఇప్పటికే నగరంలో పలు ప్రధాన దారుల్లో బ్లాక్ టాప్(బీటీ) రోడ్స్ వేయడం జరిగిందన్నారు. ప్రజల కు నిత్యం అవసరమయ్యే రోడ్లు వేసి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని సంకల్పించమని పేర్కొన్నారు. మంత్రి వెంట సూడా చైర్మన్ బచ్చు విజయ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, పబ్లిక్ హెల్త్ ఈజ్ రంజిత్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్‌లు కర్నాటి కృష్ణ, పగడాల శ్రీవిద్య, దండా జ్యోతి రెడ్డి, కమర్తపు మురళి, నాయకులు పగడాల నాగరాజు, స్వరూప రాణి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story