- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇంటి దొంగలు.. రెమిడెసివిర్ ఇంజెక్షన్లు నొక్కేసిన ఆర్ఎంపీ, నర్సు అరెస్టు

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే మరోవైపు కొందరు ప్రైవేటు వైద్యులు, నర్సులు చేతివాటం ప్రదర్శిస్తు్న్నారు. కొవిడ్ నివారణకు వినియోగించే రెమిడెసివిర్ ఇంజెక్షన్లను గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే విజయవాడ యూనియన్ ఆస్పత్రిలో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. కొవిడ్ రోగి కోసం ఆస్పత్రి వైద్యులు ఆరు రెమిడిసివిర్ ఇంజెక్షన్లను తెప్పించారు. అందులో మూడు ఇంజెక్షన్లు ఉపయోగించాక ఆ రోగి మరణించాడు. అనంతరం మిగిలిన మూడు ఇంజెక్షన్లను నర్సు, ఆర్ఎంపీ వైద్యుడు దొంగిలించారు. వీటిని బయట గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న సమయంలో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story