జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో చిన్నారి మృతి.. RMO విచారణ

by Sridhar Babu |
జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో చిన్నారి మృతి.. RMO విచారణ
X

దిశ, జగిత్యాల : వైద్యుల నిర్లక్ష్యం వలన చిన్నారి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించగా ఈ ఘటనపై సోమవారం ఆసుపత్రి ఆర్ఎంఓ విచారణ జరిపారు. ధర్మపురికి చెందిన 3 నెలల చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా వాంతులతో బాధపడుతున్న చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఆర్‌ఎంఓ రామకృష్ణ విచారణ జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story