- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాన్యుడికి షాక్.. రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు
దిశ, వెబ్‌డెస్క్: చమురు ధరలు మరోసారి పెరిగాయి. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం మరోసారి 35 పైసల చొప్పున పెంచింది. తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు రూ.86.65, డీజిల్ ధర రూ.76.83కి చేరింది. ఇక హైదరబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.90.10, డీజిల్ రూ.83.81 చేరింది.
ముంబైలో పెట్రోల్ లీటర్ ధర రూ.93.20, డీజిల్ ధర రూ.83.73కి చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.88.01, డీజిల్ రూ.80.41.. బెంగుళూరులో పెట్రోల్ రూ. 89.54, డీజిల్ రూ.81.44.. చెన్నైలో పెట్రోల్ రూ.89.13, డీజిల్ రూ.82.04.. గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర రూ.84.72, డీజిల్ ధర రూ.77.39.. నోయిడాలో లీటర్ పెట్రోల్ రూ.85.91, డీజిల్ ధర రూ.77.24కు చేరాయి. అయితే 2020 నుంచి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధర సుమారు రూ.14 పెరిగింది.