టాస్క్ ఫోర్స్ దాడిలో బియ్యం వ్యాపారి అరెస్ట్

by Sridhar Babu |
arrest1
X

దిశ, కోదాడ : టాస్క్ ఫోర్స్ దాడిలో కోదాడ పట్టణానికి చెందిన బియ్యం వ్యాపారి అరెస్ట్ అయ్యాడు. సోమవారం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ బృందం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పేద ప్రజల నుండి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు కోదాడ పట్టణంలో ఈ దందా కొనసాగుతుందని సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ ఈ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో బియ్యం వ్యాపారిని అరెస్టు చేసి ఆయన వద్ద ఉన్న కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాల్ డేటా ఆధారంగా మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారని సమాచారం.

Advertisement

Next Story