- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సుప్రీం కోర్టుకెళ్లిన రియా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై కేసు పెట్టారు. పాట్నాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐ ఆర్ నమోదు కాగా, తన కంప్లైంట్‌లో కేకే సింగ్ అడిగిన ప్రశ్నలు సీబీఐ ఎంక్వైరీ డిమాండ్‌కు బలమైన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా సుశాంత్ 2019 వరకు మెంటల్‌గా బలంగా ఉన్నా.. రియా చక్రవర్తితో టచ్‌లోకి వచ్చాకే సుశాంత్ మెంటల్ కండిషన్ ఎందుకు దెబ్బ తినిందని ప్రశ్నించారు. సుశాంత్ ఎకౌంట్‌లో నుంచి రూ. 15 కోట్లు వేరే ఎకౌంట్‌లోకి ట్రాన్స్ ఫర్ చేయాల్సిన అవసరం ఏం వచ్చిందన్నారు. సుశాంత్ మెంటల్ కండిషన్ సరిగ్గా లేక ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యామిలీ పెర్మిషన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తూ రియాపై కేసు పెట్టారు కేకే సింగ్.
దీంతో కేసు నమోదు చేసుకున్న పాట్నా పోలీసులు విచారణ నిమిత్తం ముంబై చేరుకోగా..ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బీహార్ నుంచి ముంబైకి మార్చాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రియా. ఈ విషయాన్ని రియా తరపు న్యాయవాది సతీష్ మానే షిండే వెల్లడించారు.