అలా చేస్తే నన్ను గే అనుకుంటారు : ఆర్జీవీ

by Shyam |   ( Updated:2021-08-30 07:54:06.0  )
rgv
X

దిశ, సినిమా : మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఎమోషనల్ లవ్ స్టోరీ సెప్టెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా ‘డియర్ మేఘ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించగా.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ఇలాంటి ఎక్స్‌ట్రార్డినరీ రొమాంటిక్ లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో రాలేదని అన్నారు. హరి గౌర కంపోజ్ చేసిన పాటలు చాలా బాగున్నాయని, మెలొడీ సాంగ్స్‌ను బాగా ఎంజాయ్ చేశానని తెలిపారు. ఇక హీరోయిన్ మేఘా ఆకాష్ గురించి మాట్లాడుతూ.. ఆమె 40 ఏళ్ల కిందట కనిపించి ఉంటే, తనకు డైవోర్స్ కాకపోయుండేవని కామెంట్ చేశారు.

క్లాసు వదిలేసి నగ్న వీడియోలతో బాలిక.. లైక్ చేయాలని బంధువులకు షేర్ చేసి

‘మేఘ చాలా క్యూట్, హోమ్లీ లుక్‌లో ఉంది, కానీ నా సినిమాలకు సెట్ అవదు. ఇక హీరో అరుణ్ ఆదిత్‌ను ఎక్కువ పొగిడితే నన్ను గే అనుకుంటారు. అతనితో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నా. ఫైనల్‌గా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పను. ఎందుకంటే సినిమా గురించి నా ఫీలింగ్స్ ఆల్రెడీ చెప్పేశాను’ అంటూ స్పీచ్ ముగించారు వర్మ. కాగా ఆర్జీవీకి లేట్ శ్రీదేవితో పనిచేయడం ఎంత కిక్ ఇచ్చిందో, తనకు మేఘా ఆకాష్‌తో పనిచేయడం అంతే కిక్ ఇచ్చిందని దర్శకుడు సుశాంత్ రెడ్డి అన్నారు.

‘మేఘ చాలా క్యూట్, హోమ్లీ లుక్‌లో ఉంది, కానీ నా సినిమాలకు సెట్ అవదు

Advertisement

Next Story