‘శశికళ’ బయోపిక్ ప్రకటించిన ఆర్జీవీ

by Shyam |
‘శశికళ’ బయోపిక్ ప్రకటించిన ఆర్జీవీ
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాదం అంటేనే ఇంట్రెస్ట్ చూపించే డైరెక్టర్ ఆర్జీవీ.. మరో వివాదాస్పద చిత్రం తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ జీవిత కథ ఆధారంగా ‘శశికళ’ పేరుతో బయోపిక్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. శశికళ, యడ్యూరప్ప కలిసి జయలలితకు ఎలాంటి ద్రోహం చేశారు? అనేది సినిమాలో చూపించబోతున్నాడు ఆర్జీవీ. కాగా తమిళనాడు ఎలక్షన్స్‌కు ముందు ఈ సినిమా విడుదల చేస్తామని తెలిపాడు.

కంగనా రనౌత్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న జయలలిత బయోపిక్ ‘తలైవి’ విడుదల రోజే ‘శశికళ’ సినిమా కూడా రిలీజ్ చేస్తామని చెప్పాడు. ‘దగ్గరగా ఉంటే చంపడం తేలిక’ అన్న స్లోగన్ తమిళనాడులో ఫేమస్ అని.. అదే ఈ సినిమా స్టోరీ లైన్ అన్న ఆర్జీవీ.. శశికళ, యడ్యూరప్ప, జయలలిత మధ్య ఉన్న సంక్లిష్టమైన, కుట్ర పూరిత బంధాల చుట్టూ సినిమా సాగుతుందని స్పష్టం చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రొడ్యూస్ చేసిన రాకేష్ రెడ్డి ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తారని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed