- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ భారీ ప్లాన్.. 17 నియోజకవర్గాల్లో వచ్చే నెల 17వరకు..
దిశ, తెలంగాణ బ్యూరో : ఇంద్రవెల్లి సభకు ముందు కాంగ్రెస్కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి వచ్చేనెల 17 వరకు రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. అధిష్టానం ఆదేశాలతో రేవంత్‌రెడ్డి ఈ సభలను ఖరారు చేస్తున్నారు. ఇంద్రవెల్లి నుంచి మొదలవుతున్న దళిత, గిరిజన దండోరాను రాష్ట్రమంతా నిర్వహించనున్నారు. గిరిజనులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దళిత సమస్యలను టార్గెట్‌గా తీసుకుని భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలకు ప్రత్యేకంగా విధులు అప్పగిస్తున్నారు.
రేవంత్ పాదయాత్రపై త్వరలోనే నిర్ణయం..
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో చేపట్టే పాదయాత్రపై అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వచ్చేనెల 17 వరకు చేపట్టే దళిత, గిరిజన దండోరా కార్యక్రమానికి రాహుల్‌గాంధీ రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆయన రాకపై తేదీ ఖరారు చేయాల్సి ఉంది. అయితే పాదయాత్రపై రాహుల్ గాంధీ నుంచే ప్రకటన చేయించాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. వచ్చేనెలలో పాదయాత్ర ఉండే అవకాశం ఉంది.
- Tags
- meetings