- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రెండు పార్టీలను నమ్మొద్దు: రేవంత్ రెడ్డి
దిశ ప్రతినిధి, వరంగల్: సెకండ్ క్యాపిటల్‌గా వరంగల్‌ను డెవలప్ చేయడంలో సీఎం కేసీఆర్ ఫెయిల్ అయ్యారని.. ఈ విషయాన్ని పక్కనబెట్టి ఓటు బ్యాంకు కోసం ప్రజల మధ్య బీజేపీ నేతలు చిచ్చు పెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించిన ఆయన టీఆర్ఎస్, బీజేపీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వరంగల్ అభివృద్ధికి దూరం అయిందని.. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కుస్తీలు.. ఢిల్లీలో దోస్తీ చేస్తున్న కమలం, కారు పార్టీలను ప్రజలు నమ్మవద్దన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే అది చేస్తాం.. ఇది చేస్తామన్న బండి సంజయ్ సీట్లు వచ్చిన తర్వాత వరద బాధితుల ఊసే ఎత్తకపోవడం ఏంటని నిలదీశారు. కేవలం రాష్ట్రంలో బీజేపీ బలం పెంచడం కోసం ప్రజల మధ్య చిచ్చులు పెడుతున్నారని.. వరంగల్ ఎన్నికల్లో కూడా ఇదే కొనసాగిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ రెండు పార్టీల స్వార్థ ప్రయోజనాలను ప్రజలు గమనించాలని రేవంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2004 నుంచి 2014 వరకు వరంగల్‌లో అభివృద్ధి జరిగిందని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు.