అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.61 శాతం

by Harish |
అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.61 శాతం
X

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) వరుసగా 9వ నెలలోనూ పెరిగింది. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగటం వల్ల అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.61 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్‌లో ఇది 7.34 శాతంగా నమోదైంది. 2014, మేలో 8.33 శాతం తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే అత్యధికం.

ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఏకంగా 11.07 శాతానికి పెరిగినట్లు జాతీయ గణాంక కార్యాలయం(ఎన్​ఎస్​వో) వెల్లడించింది. సెప్టెంబర్‌లో ఇది 10.68 శాతంగా ఉంది. అలాగే, అక్టోబర్ నెలలో కూరగాయల ధరల ద్రవ్యోల్బణ రేటు 22.51 శాతంగా ఉంది. వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో సరఫరా లేక ఉల్లి ధరలు అక్టోబర్‌లో భారీగా పెరిగాయి. అలాగే, బంగాళదుంప్, టమోటా ధరలు కూడా సగటు స్థాయిలను మించి పెరిగాయని ఎన్ఎస్‌వో తెలిపింది. పప్పు ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణ రేటు 18.34 శాతంగా నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed