- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మళ్లీ పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం!
దిశ, వెబ్‌డెస్క్: వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి ఊహించిన దానికంటే భారీగా పెరిగింది. మార్చి నెలకు సంబంధించి సీపీఐ 5.52 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో నమోదైన 5.03 శాతం కంటే ఇది ఎక్కువగా నమోదైనట్టు కేంద్ర గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) సోమవారం తెలిపింది. ఆహార ద్రవ్యోల్బణ అధికంగా పెరగడం వల్లే సీపీఐ ద్రవ్యోల్బణం గతం కంటే ఎక్కువగా నమోదైనట్టు ఎన్ఎస్ఓ అభిప్రాయపడింది. ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.87 శాతంగా నమోదవగా, మార్చిలో ఇది 4.94 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు 4.83 శాతం తగ్గాయి. తృణ ధాన్యాలు 0.69 శాతం తగ్గాయి. ‘నూనెలు-కొవ్వులు’ ధరలు అధికంగా 20.78 శాతం నుంచి 24.92 శాతానికి పెరిగాయి. మాంసం, చేపలు 15.09 శాతం, పప్పు ధాన్యాలు 13.25 శతం, గుడ్లు 10.6 శాతం, పండ్లు 7.86 శాతం, పాలు, పాల ఉత్పత్తులు 2.24 శాతం పెరిగాయి. ఇంధన ద్రవ్యోల్బణం 4.50 శాతం ఉండగా, ఆరోగ్య సేవల ద్రవ్యోల్బణం 6.17 శాతం నమోదైంది.