- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుర్చీకి చెప్పుకుంటే చాలంట ! ఇక్కడ చైరే లీడరట!!
దిశ, తెలంగాణ బ్యూరో : ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. సమస్యలు చెప్పుకొనేందుకు చైర్స్ ఉంటే చాలంటున్నారు లీడర్లు ! అపాయింట్‌మెంట్స్, అనుమతులు అసలే అవసరం లేదంట! తామనుకున్న దగ్గరే చెప్పాల్సిన వారికి ఓ కుర్చీ వేసి మ్యాటరంతా చెప్పేస్తున్నారు. అక్కడే వినతులూ ఇచ్చేస్తున్నారు. ఇటీవల రెండు ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు ఇలాగే వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. వీరికి మీడియాలో బ్రహ్మాండమైన పబ్లిసిటీ దొరికింది. వీరు ఎంచుకున్న నిరసన పద్ధతి జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు మరికొంతమంది ఈ ట్రెండేదో భలేగుందంటూ ఫాలో అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
తమిళనాడులో జయలలిత చనిపోయిన తర్వాత ఆమె ఫొటో పెట్టి మరీ సమావేశాలు జరుపుకునేవారు అన్నాడీఎంకే నాయకులు. జయలిలత కూర్చునే కుర్చీని సైతం ఖాళీగా ఉంచేవారు. ఆమె అక్కడా ఉన్నారనే భావనే వారిలో ఉండేది. ఇప్పుడు సవాళ్ళు విసురుకుంటున్న నేతలు రాకపోవడంతో ఓ కుర్చీ, అందులో ఒక ఫొటో పెట్టే కానిచ్చేసేవారు. గన్‌పార్కు దగ్గర కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ అదే పని చేశారు. ఉస్మానియా వర్శిటీలో బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు కూడా అదే తీరులో కుర్చీ, ఫొటోతోనే చర్చలు పూర్తిచేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రభుత్వం గడచిన ఆరేళ్ళలో ఎన్ని నోటిఫికేషన్లను విడుదల చేసిందో, వాటితో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పేశారు. ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. ఆరేళ్లలో 1.32 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటించారు. దమ్ముంటే విపక్షాలు తాను చెప్పింది అబద్దాలని నిరూపించాలని సవాల్ విసిరారు. అవసరమనుకుంటే ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం తెప్పించుకోవచ్చని సలహా ఇచ్చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ సర్కార్ నుంచి పెద్ద నోటిఫికేషన్స్ రాలేదని భావన యువతలో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మంత్రి హోదాలో ఉద్యోగాల కల్పనపై కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయం వార్తా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో బాగానే హైలెట్ అయింది.
ఇక సోషల్ మీడియాలో అయితే మంత్రి గారి మీద నిరుద్యోగులు, యువత ఒక్కటే ట్రోల్ మొదలెట్టారు. లేఖపై జోకులు,కామెడీ కార్టూలు, కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ తానేమి తక్కువ కాదనుకున్నట్లున్నారు. కేటీఆర్ విడుదల చేసిన లేఖపై ఓ కొత్త పంథాను ఎంచుకున్నారు. ఏకలవ్యుడిని ద్రోణాచార్యుడు పట్టించుకోకున్న గురువుగా భావించి విద్యా నేర్చుకున్నట్లు.. కేటీఆర్ మంత్రి అయి అపాయింట్ మెంట్స్ ఇవ్వకున్నా.. ఆయనకు తన ఆవేదనను వెలిబుచ్చాలనుకున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగాలపై కేటీఆర్ విడుదల చేసిన లేఖపై అసెంబ్లీ ముందున్న అమరు వీరుల స్థూపం వద్దకు బహిరంగ చర్చకు రావాలని దాసోజు పిలుపునిచ్చినా.. ఆయన రాకపోవడంతో అక్కడే ఒక్క కూర్చీ వేసి బొట్టుపెట్టారు. కేటీఆర్ చెప్పివన్నీ అబద్దాలేనంటూ చెప్పుకొచ్చారు. ఇది కొంత మీడియాలో ఫోకస్ కావడంతో శ్రవణ్ కుమార్ హైలెట్ అయ్యారు. నిరసనలో తన నిరసన వేరయ్యా అంటూ.. ఆయన చేసిన ఆందోళన పలువురుని ఆకట్టుకుంది. కూర్చీలకు వినతి పత్రాలివ్వడం కొత్తే కావడంతో బాగానే పాపులర్ అయింది. అయితే దాసోజ్ కు వచ్చిన పబ్లిసిటీని పసిగట్టేసిన బీజేపీ సీనియర్ నాయకులు రామచంద్రారావు ఇదే పంథా ను ఎంచుకోవడం విశేషం. ఈయన కూడా సోమవారం ఓయూలో చైర్ లో కేటీఆర్ కు బొమ్మపెట్టి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు.
ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులు చేసిన వినూత్న నిరసన నెటిజన్లు,నాయకులను బాగానే ఆకట్టుకుంటుందంటా..! సమస్యలు చెప్పుకునేందుకు మంత్రులు ఏలాగో దొరకరని, ఇలా ఫోటోలు పెట్టుకుని సమస్యలు విన్నవించుకుంటే అటూ మీడియా పబ్లిసిటీతో పాటు.. ఇటు జనం నోళ్లలో నానోచ్చని అనుకుంటున్నారంటా పొలిటికల్ లీడర్లు. అందుకే కాబోలు చెప్పుకునేందుకు ఓ ఛైర్ ఉంటే చాలంటున్నారంటా..!!