పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలి

by Shyam |
పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వెంటనే పీఆర్‌సీని అమలు చేయాలని రాష్ట్ర రిటైర్డ్, ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. 2018 జూలై నుంచి పీఆర్‌సీని వర్తింపజేయాలని, ఐదేండ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులను వెంటనే చేపట్టాలని కోరారు. ముఖ్యమంత్రికి సమస్యలను వివరించి పరిష్కరిచేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బి.మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరోత్తం రెడ్డి, టి. ప్రభాకర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story