- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆ ప్రయోజనాలు అందుకోలేకపోతున్రు'
దిశ బోధన్: బోధన్ మున్సిపాలిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్ టీయూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మల్లేష్ మాట్లాడుతూ కరోనా నియంత్రణ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు తమ వంతు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని, కార్మికులకు వారంతపు సెలువులు, గతంలో డీఎంహెచ్ వో వద్ద చర్చలు జరిపి కుదిరిన ఒప్పందం ప్రకారం సంవత్సరానికి 15 క్యాజువల్ సెలువులు ఇవ్వడంలేదన్నారు. సెలువులు లేకుండా పనులు చేయడం మూలంగా కార్మికులు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని తెలిపారు.
అలాగే కార్మికులకు పనిముట్లు ఇవ్వకపోవడంతో కార్మికులే వారి సొంత డబ్బులతో కొనుగోలు చేస్తున్నారన్నారు. పీఎఫ్, ఈఎస్ ఐ డబ్బులను కార్మికుల ఖాతాలలో ఎప్పటికప్పుడు జమ చేయడం లేదని, దీని మూలంగా వాటి ప్రయోజనాలను కార్మికులు పొందలేక పొతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని చేసేచోట వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టీయూ నాయకులు యాడవ్, మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు బి. పర్వయ్య, ఎం. గంగామణి, సంజీవ్, ఎం.గంగాధర్, మరియా, సంతోష్, యూ.గంగారాం, గంగామణి, పరమేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.