సందేశాత్మకం.. సాయిధరమ్ తేజ్-దేవకట్టా ‘రిపబ్లిక్’

by Shyam |   ( Updated:2023-12-16 17:04:11.0  )
సందేశాత్మకం.. సాయిధరమ్ తేజ్-దేవకట్టా ‘రిపబ్లిక్’
X

దిశ, వెబ్‌‌డెస్క్: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం అప్‌డేట్ వచ్చేసింది. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్‌గా జగపతి బాబు, రమ్యక్రిష్ణ ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమాకు ‘రిపబ్లిక్’ టైటిల్ ఫైనల్ చేసేశారు. తేజ్ వాయిస్‌ ఓవర్‌తో ఉన్న మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ..రిపబ్లిక్ డే విషెస్ అందించారు.‘యువర్ హానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు, శాసనాలు అమలు చేసే ప్రభుత్వోద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు సరిదిద్దుకుంటూ క్రమబద్ధంగా సాగినప్పుడే.. అది ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రభుత్వం అవుతుంది. అదే అసలైన రిపబ్లిక్ ’ అంటూ రిపబ్లిక్ డేను పురస్కరించుకుని సమాజానికి మెసేజ్ ఇచ్చారు. జేబి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్న సినిమా సమ్మర్‌లో రిలీజ్ కానుందని తెలిపారు.

Next Story

Most Viewed

    null