- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేసీఆర్ సార్.. ప్రజలకేనా రూల్స్.. వారికి వర్తించవా.?

దిశ, మధిర : ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం కరోన నిబంధనలు కట్టదిట్టం చేస్తుంటే.. స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం వాటికి తూట్లు పోడుస్తున్నారు. ఏకంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ సహా ఇతర నేతలు ఏ ఓక్కరూ కూడా మాస్కులు పెట్టుకున్న పాపాన పోలేదు. బుధవారం ముదిగోండ మండలం ముత్తారం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణా స్వీకారోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు, నూతన పాలక వర్గం సభ్యులు.. కరోనా నిబంధనలు పాటించలేదు. ఏ ఒక్కరూ మాస్కు ధరించలేదు. సామాన్యులు మాస్కు పెట్టు కోకుంటే అధికారులు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నారు. కానీ ప్రజాప్రతినిధులై ఉండి మాస్కులు పెట్టుకోక పోవటం ఏమిటని స్థానికులు చర్చించుకున్నారు. నలుగురికి చెప్పాల్సిన నాయకులే ఈ విధంగా వ్యవహరించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.