- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకనుంచి వాటిమీద పీఎం మోడీ ఫోటో మాయం
దిశ, వెబ్‌డెస్క్: బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) చర్యలు తీసకుంది. కొవిడ్ లబ్దిదారులకు అందించే డిజిటల్ సర్టిఫికెట్లపై ఇకనుంచి ప్రధాని మోడీ బొమ్మను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమబెంగాల్‌తో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొవిడ్ లబ్దిదారులకు అందజేస్తున్న డిజిటల్ సర్టిఫికెట్లపై మోడీ ఫోటో ఉండటం ఎన్నికల నియమావళికి వ్యతిరేకమని టీఎంసీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఆ పార్టీ మూడు రోజుల క్రితం ఈసీకి లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో ఈసీ శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత సర్టిఫికెట్లపై మోడీ ఫోటోలను తొలగించాలని ఆదేశించింది. అయితే డిజిటల్ సర్టిఫికెట్ల ప్రక్రియ ఎన్నికల నిమయావళి కంటే ముందే ప్రారంభమైందని వైద్య శాఖ అధికారులు అంటున్నారు. కాగా ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఇకనుంచి డిజిటల్ సర్టిఫికెట్ల మీద మోడీ బొమ్మను బ్లర్ చేసి లబ్దిదారులకు అందించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి : 30 రోజులు.. 60 మంది.. ఝార్ఖండ్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్
ఈసీ తాజా నిర్ణయంతో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో సర్టిఫికెట్లపై మోడీ ఫోటో కనుమరుగు కానున్నది.