కరోనా వ్యాక్సిన్: కొవిన్‌లో నమోదు తప్పనిసరి కాదు

by Shamantha N |
కరోనా వ్యాక్సిన్: కొవిన్‌లో నమోదు తప్పనిసరి కాదు
X

న్యూఢిల్లీ: టీకా పంపిణీకి కొవిన్ పోర్టల్‌లో ముందస్తు నమోదు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 18ఏళ్లు పైబడినవారూ నేరుగా టీకా పంపిణీ కేంద్రానికి చేరుకుని స్పాట్‌లోనే రిజిస్టర్ చేసుకోవచ్చని, అదే రోజు టీకా తీసుకోవచ్చని వివరించింది. టీకా తీసుకోవడానికి నమోదుచేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక మార్గాలను ముందుంచిందని, అందులో స్పాట్ రిజిస్ట్రేషనూ ఒకటని తెలిపింది.

జూన్ 13వ తేదీ వరకు 28.36 కోట్ల లబ్దిదారులు కొవిన్‌లో రిజిస్టర్ అయ్యారని, ఇందులో 16.45 కోట్ల మంది ఆన్‌సైట్‌లోనే నమోదు చేసుకుని టీకా వేసుకున్నారని వివరించింది. కొవిన్ నమోదు తప్పనిసరి చేసిన కేంద్రప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఇటీవలే ప్రశ్నలు కురిపించింది. డిజిటల్ లిటరసీలో తారతమ్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యతను ప్రస్తావిస్తూ ఇంటర్నెట్ సదుపాయం లేనివారు టీకా ఎలా వేసుకోవాలని అడిగింది.

Advertisement

Next Story

Most Viewed