జీఎస్టీ తగ్గించాల్సిందంటున్న డెవలపర్లు!

by Harish |
జీఎస్టీ తగ్గించాల్సిందంటున్న డెవలపర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: వాణిజ్య రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కో-వర్కింగ్ ఆపరేటర్లు కేంద్ర బడ్జెట్‌లో ఈ రంగానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోవడం వల్ల నిరాశను వ్యక్తం చేశారు. లీజింగులపై జీఎస్టీని తగ్గించడం వల్ల ఆఫీ స్థలాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుందని వారు భావిస్తున్నారు. గతేడాది కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఈ రంగం ఎక్కువగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ 50 శాతం పడిపోయిందని, కరోనా నుంచి ఈ రంగం పూర్తిగా కోలుకునేందుకు రెండేళ్లు పట్టొచ్చని ప్రాపర్టీ కన్సల్టెంట్ అభిప్రాయపడుతున్నారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కార్యాలయాల స్థలాలు ప్రభావితమయ్యాయి. బడ్జెట్‌లో ఈ రంగాన్ని గుర్తించాల్సింది. వాణిజ్య రియల్ ఎస్టేట్ కోసం స్టాంప్ డ్యూటీని తగ్గించడం, సింగిల్ విండో క్లియరెన్స్, జీఎస్టీని తగ్గించి ఉంటే ఈ రంగం పునరుజ్జీవనం పొందేదని’ ప్రీమియం ఆఫీస్ స్థలాల అందించే స్కూటర్ సంస్థ హెడ్ రజత్ జోహార్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed