- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రైవేటులో ప్రసవాలకు నో..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఆస్పత్రులు మరోసారి తమ కక్కుర్తి బుద్ధిని చూపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో.. ప్రైవేటు దవాఖానాల్లో ప్రసవాలకు వెనకడుగు వేస్తున్నారు. గత అయిదారు నెలలుగా ప్రైవేటు వారు కాన్పులు అంతంత మాత్రంగానే చేస్తుండగా, ఏప్రిల్, మే నెలల్లో అసలు అంతగా కాన్పులు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో జనాలు ప్రైవేటు ఆస్పత్రులను కాదని సర్కారు దవాఖానాలకు వరుస కడుతున్నారు. కాసుల కక్కుర్తిలో పడిన ప్రైవేటు వారు కరోనా రోగులకు చికిత్సకే పెద్దపీట వేస్తున్నారు. దీంతో సర్కారు ఆసుపత్రిలలో, పీహెచీసీల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల వారు ప్రసవాలు చేసేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో గత అయిదు నెలలుగా ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాల సంఖ్య ఎక్కువగా ఉండగా, కరోనా విజృంభిస్తున్న ఏప్రిల్, మే నెలల్లో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది (2021) జనవరి నుంచి మే వరకు అయిదు నెలల్లో మొత్తం 11683మంది గర్భిణీలు ప్రసవించారు. వీటిలో 7232 మంది మహిళలు ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులుకాగా కేవలం 4451మంది మహిళలు మాత్రమే ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవించారు. ఈ లెక్కన ప్రైవేటు ఆస్పత్రుల కంటే 60శాతం అధికంగా ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే చేస్తున్నారు. గత అయిదు నెలల్లోనే ప్రైవేటు ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2781 ప్రసవాలు ఎక్కువయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రైవేటు ఆస్పత్రుల కంటే ఎక్కువగా కాన్పులు అవుతున్నాయి.
గత అయిదు నెలల్లో నిర్మల్ జిల్లాలో మొత్తం 3254కాన్పులయ్యాయి. ఇందులో సర్కారులో 1905ప్రసవాలుకాగా,ప్రైవేటులో 1349 కాన్పులయ్యాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 1992మంది ప్రసవించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రిలో 1151మంది ప్రసవించగా, ప్రైవేటు దవాఖానాల్లో 841మంది ప్రసవించారు. మంచిర్యాల జిల్లాలో జనవరి నుంచి మే వరకు మొత్తం 2511కాన్పులవగా ఇందులో సర్కారు ఆస్పత్రుల్లో 1539, ప్రైవేటు ఆస్పత్రుల్లో 972 కాన్పులు చేశారు. మంచిర్యాల జిల్లాలో ఏప్రిల్, మే నెలల్లో కలిపి సర్కారు దవాఖానాల్లో 435మంది కాన్పులు కాగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 305మంది ప్రసవించారు. ఆదిలాబాద్ జిల్లాలో అయిదు నెలల్లో 3926ప్రసవాలుకాగా, ఇందులో సర్కారు దవాఖానాల్లో 2637, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1289మంది మాత్రమే ప్రసవించారు. ఈ రెండు నెలల్లో సర్కారు ఆస్పత్రుల్లో 917మంది ప్రసవించగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 517మంది మాత్రమే కాన్పులు చేసుకున్నారు.
———————————————-
జిల్లాల వారీగా ప్రసవాల వివరాలు (జనవరి-మే)
———————————————–
జిల్లా పేరు ప్రభుత్వ ప్రైవేటు మొత్తం
———————————————–
ఆదిలాబాద్ 2637 1289 3926
నిర్మల్ 1905 1349 3254
మంచిర్యాల 1539 972 2511
ఆసిఫాబాద్ 1151 841 1992
———————————————–
మొత్తం 7232 4451 11683
———————————————–