'దేశీయ విమాన ప్రయాణాల్లో మెరుగైన రికవరీ'

by Harish |
దేశీయ విమాన ప్రయాణాల్లో మెరుగైన రికవరీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ విమాన ప్రయాణాల డిమాండ్ నెలవారీగా పెరుగుతూనే ఉందని, అక్టోబర్ నెలకు సంబంధించి సెప్టెంబర్‌తో పోలిస్తే 33 శాతం వృద్ధి నమోదైనట్టు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. అయితే, వార్షిక ప్రాతిపదికన దేశీయ ప్రయాణాల డిమాండ్ 58 శాతం, అంతర్జాతీయంగా 87 శాతం తగ్గిందని ఇక్రా పేర్కొంది. భారత విమానయాన పరిశ్రమ అక్టోబర్‌లో నిరంతర పునరుద్ధరణ సాధించింది.

సెప్టెంబర్ నుంచి 33 శాతం పెరిగి మొత్తం 52 లక్షల మంది ప్రయాణీకులకు చేరుకుంది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే సామర్థ్యం 52 శాతంగా ఉందని, ఆగష్టులో ఇది 33 శాతం ఉందని ఇక్రా పేర్కొంది. పండుగ సీజన్ నేపథ్యంలో రానున్న రోజుల్లో సామర్థ్యం 70-75 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ వార్షిక ప్రాతిపదికన 87 శాతం క్షీణించి 2,55,075కు చేరుకుందని, అయితే..నెలవారీగా పరిశీలిస్తే అక్టోబర్‌లో 22 శాతం మెరుగుపడిందని ఇక్రా తన ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed