- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇంగ్లీష్ ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌కు తొలి మహిళా రిఫరీ
by Shiva |

X
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లీష్ ఫుట్‌బాల్ లీగ్‌లో జరుగనున్న పురుషుల ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు రిఫరీగా ఒక మహళ తొలి సారిగా నియమించబడింది. రెబెకా వెల్ష్ రాబోయే సోమవారం హర్రొగేట్, పోర్ట్ వాలీ మధ్య జరుగనున్న మ్యాచ్‌కు ఆమె రిఫరిగా వ్యవహరించబోతున్నారు. ఇంగ్లీష్ ఫుట్‌బాల్ చరిత్రలో వెల్ష్ హయ్యెస్ట్ ర్యాంకింగ్ మహిళా రిఫరీగా పేరున్నది. ఈ సీజన్‌లో రిఫరీగా ఆమె ప్రదర్శనను గమనించిన మైక్ రిలే, మైక్ జోన్స్‌లు పురుషుల మ్యాచ్‌లకు రిఫరీగా నియమించారు. వచ్చేవారం జరుగబోయే రెండు మ్యాచ్‌లకు ఆమె రిఫరీగా బాధ్యతలు చేపట్టనున్నది. కాగా, ఇటీవలే ఫ్రాన్స్‌కు చెందిన స్టెఫానీ ఫ్రాప్పర్ట్ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. అది జరిగి వారం గడవక ముందే ఇంగ్లీష్ ఫుట్‌బాల్ లీగ్‌లో మరో మహిళ రిఫరీగా బాధ్యతలు చేపట్టనుండటం గమనార్హం.
Next Story