- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రియల్ హీరోస్ ప్రకాశ్ రాజ్, రాజశేఖర్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా ప్రభావంతో మనిషిని మనిషి చూసేందుకే భయపడుతున్న సమయంలో మనిషికి మనిషి సాయం అవసరమని పిలుపునిస్తున్నారు సినీ ప్రముఖులు ప్రకాశ్ రాజ్, డాక్టర్ రాజశేఖర్. కరోనా కారణంగా జీవన వ్యవస్థ స్తంభించగా.. ఇతరుల జీవితాలకు గౌరవాన్నిస్తూ ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. సినిమా షూటింగ్లు వాయిదా పడడంతో… కనీసం తినడానికి తిండి కూడా లేని సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజు… యాక్టర్‌గా ఎంత గొప్పస్థాయలో ఉన్నాడో.. అంత కన్నా గొప్ప మనిషిలా కనిపిస్తున్నాడు ఇప్పుడు. సినిమా ఇండస్ట్రీ మీద, తన మీద ఆధారపడిన వ్యక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. వారికి అండగా నిలిచాడు. తన ఇంట్లో, ఫార్మ్ హౌజ్‌లో, ఫిల్మ్ ప్రొడక్షన్‌లో, ఫౌండేషన్‌లో పనిచేస్తున్న వారికి, వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకు జీతాలు చెల్లించారు. తన హోమ్ ప్రొడక్షన్‌లో వస్తున్న మూడు చిత్రాలకు సంబంధించిన కూలీలను కూడా ఆదుకున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ మూలంగా దూరం పెరిగినా .. మనుషుల మనసుల మధ్య దూరం రాకూడదని నిరూపించాడు. దీంతో నా సహాయం ఆగదని… నా శక్తి మేరకు సాయం అందిస్తానని తెలిపిన ప్రకాశ్ రాజ్…. మీ సహాయం అవసరమైన వారు మీ చుట్టూ ఉండే ఉంటారు… ఒక్క సారి చూడండి… పెద్ద మనస్సుతో ఆదుకోండి అని పిలుపునిచ్చారు. ఒకరి జీవితాన్ని నిలిపే సమయమిదని గుర్తుంచుకోవాలని సూచించారు.
కరోనా వైరస్ ప్రభావంతో కుంగిపోతున్న నిరుపేద కార్మికులకు భరోసా ఇస్తున్నారు డాక్టర్ జీవితా రాజశేఖర్‌లు. మార్చి 31వరకు షూటింగ్‌లు వాయిదా వేయడంతో … తిండికి నోచుకోని సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సరుకులను అందిస్తున్నారు. సహాయం పొందాలనుకునే కళాకారులు 90108 10140 నంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు. మీకు ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు మేమున్నామనే ధైర్యాన్ని నింపుతున్నారు..
Tags : Rajashekhar, Jeevitha, Prakash Raj, CoronaVirus, Covid19