Sputnik V vaccine : దేశీయ స్పుత్నిక్-వి టీకా ఉత్పత్తి ప్రారంభం

by Harish |   ( Updated:2021-05-24 07:09:00.0  )
Sputnik V vaccine : దేశీయ స్పుత్నిక్-వి టీకా ఉత్పత్తి ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో స్పుత్నిక్-వి టీకా ఉత్త్పత్తిని ప్రారంభించినట్టు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(RDIF), ( పనాసియా బయోటెక్ (Panacea Biotec) సంస్థలు సోమవారం ప్రకటించాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని పనాసియ బయోటెక్ కర్మాగారంలో ఉత్పత్తి చేసిన కరోనా టీకాలను నాణ్యతా ప్రమాణాల పరిశీలన కోసం రష్యాలోని గమలెయ సెంటర్‌కు పంపనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ వేసవిలోనే పూర్తిస్థాయి ఉత్పత్తిని నిర్వహించి ఏడాదికి 10కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నట్టు ఇరు సంస్థలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.

‘పనాసియా బయోటెక్ భాగస్వామ్యంతో భారత్‌లో ఉత్పత్తిని ప్రారంభించి కరోనా నియంత్రణలో భారత్‌కు సహాయం చేయడంతో ఇది మొదటిదశ’ అని ఆర్‌డీఐఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిరిల్ దిమిత్రివ్(RDIF CEO Kirill Dmitriev) చెప్పారు. గత నెల ప్రకటించిన దాని ప్రకారం.. ఏడాదికి 10 కోట్ల స్పుత్నిక్-వి డోసులను ఉత్పత్తి చేస్తామని, ప్రస్తుతం దేశీయంగా పంపిణీ చేయనున్నట్టు, అనంతరం విదేశాలకు సైతం సరఫరా చేయనున్నట్టు పనాసియా బయోటెక్ ఎండీ రాజేష్ జైన్ తెలిపారు. ఏప్రిల్ 12న స్పుత్నిక్-వి భారత్‌లో అత్యవసర వినియోగానికి రిజిస్టర్ చేసుకోగా, మే 14న టీకా వేయడం ప్రారంభించారు.

Advertisement

Next Story