సిరాజ్ అరుదైన రికార్డు

by Shyam |
సిరాజ్ అరుదైన రికార్డు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 50 డాట్ బాల్స్ వేసిన మొదటి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ 14 సీజన్‌లో తొలి మేడిన్ ఓవర్ వేసిన బౌలర్ కూడా సిరాజ్ కావడం గమనార్హం. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ కేవలం 5 వికెట్లే తీసుకున్నాడు. ఇందులో మూడు వికెట్లు గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే వచ్చాయి. వికెట్ల పరంగా చూస్తే తక్కువే అనిపించినా.. ప్రత్యర్థి జట్లకు మాత్రం పరుగులు ఇవ్వడం లేదు. మొత్తం 84 బంతులు వేసిన సిరాజ్ అందులో 50 బంతులు డాట్స్‌గా వేయడం విశేషం. ఈ సీజన్‌లో ఏ బౌలర్ కూడా సిరాజ్ విసిరినన్ని డాట్ బాల్స్ విసరలేదు.

Advertisement

Next Story