స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల సీఈఓలతో ఆర్‌బీఐ గవర్నర్ సమావేశం

by Shyam |
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల సీఈఓలతో ఆర్‌బీఐ గవర్నర్ సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్ ఆంక్షల వల్ల బ్యాలెన్స్ షీట్‌లపై పడే ఒత్తిడిని అంచనా వేయడానికి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశం నిర్వహించారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓలతో శుక్రవారం రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ దాస్ వర్చువల్ విధానంలో చర్చించారు. చిన్న చిన్న వ్యాపారాలను నిర్వహించే వారికి చిన్న తరహా బ్యాంకులు ఎంతో సహాయపడతాయని దాస్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా చిన్న బ్యాంకులు స్థిరంగా కొనసాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై మాట్లాడారు. నష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, రుణ గ్రహీతలకు సంబంధించి క్రెడిట్, ద్రవ్య పరిస్థితుల గురించి దాస్ చర్చించారు. మహమ్మారి కొనసాగుతున్న సమయంలో వినియోగదారులకు కలిగే సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకులను కోరారు. అలాగే, కస్టమర్ల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని టెక్నాలజీని వినియోగించాలని దాస్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎండీ పాత్రా, ఎం కె జైన్, రాజేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed