- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్‌బీఐ ఎమర్జెన్సీ ప్రెస్‌మీట్!
దిశ, వెబ్‌డెస్క్: కరోనాను అడ్డుకునేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది. కీలకమైన మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను వణికిస్తున్న కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు దేశాలన్నీ చర్యలకు ఉపక్రమించాయి . ఇప్పటికే అనేక దేశాలు ఆర్థిక రంగానికి ఊతమిచ్చే విధంగా చర్యలను మొదలుపెట్టగా, అమెరికా తాజాగా కీలకమైన వడ్డీరేట్లను తగ్గించింది. మరిన్ని దేశాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్యాకేజీలను ప్రకటించాయి. ఇండియాలోనూ కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతున్నందున ఆర్‌బీఐ అత్యవసర మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ఉంటుందని మీడియాకు సమాచారం ఇచ్చారు.
దేశీయంగా ఆర్థిక రంగానికి ఉపశమనం కలిగించే నిర్ణయాలు ఈ ప్రెస్‌మీట్‌లో ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఇప్పటికే వ్యాపారాల్లో ద్రవ్య లభ్యతను పెంచేందుకు కీలక వడ్డీ రేట్లను 0.25 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికాతో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఇంకా మరిన్ని దేశాలు సైతం వడ్డీ రేట్లను తగ్గించాయి. కరోనాను ఎదుర్కొనేందుకు చాలా దేశాలు కీలకమైన చర్యలు చేపడుతున్నాయి.
tags : RBI, rbi emergency press meet, press meet, Shaktikanta Das, Coronavirus