సత్యజిత్ ‘రే’ షార్ట్ ఫిల్మ్స్‌పై నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ

by Jakkula Samataha |   ( Updated:2021-05-28 05:24:55.0  )
సత్యజిత్ ‘రే’ షార్ట్ ఫిల్మ్స్‌పై నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ
X

దిశ, సినిమా : ఇండియన్ సినిమా హిస్టరీలో ఫైనెస్ట్ ఫిల్మ్‌మేకర్ ‘సత్యజిత్ రే’ (Ray) డాక్యుమెంటరీస్ మాత్రమే కాదు, షార్ట్ ఫిల్మ్స్ కూడా అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్‌కు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తాయి. కాగా ఈ స్టోరీస్ బేస్ చేసుకుని నెట్‌ఫ్లిక్స్ఇండియా ( NETFLIX INDIA) ఆంథాలజీని తీసుకురాబోతోంది. శ్రీజిత్ ముఖర్జీ, వాసన్ బాలా, అభిషేక్ చౌబే డైరెక్షన్‌లో ‘రే (Ray)’ పేరుతో రాబోతున్న ఆంథాలజీ నాలుగు స్టోరీల సంకలనం కాగా.. మనోజ్ బాజ్‌పాయ్, అలీ ఫజల్, హర్షవర్ధన్ కపూర్, గజ్‌రాజ్ రావ్ వంటి స్టార్స్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ‘ప్రేమ, కామం, నమ్మకం, ద్రోహం’ ఇలా ప్రతీ పాత్రలోనూ మల్టిపుల్ షేడ్స్ ప్రజెంట్ చేయబోతున్నట్లు చెబుతున్న మేకర్స్.. స్వీట్ సర్‌ప్రైజ్ ఉండబోతోందని తెలిపారు. జూన్ 25న ఈ ఆంథాలజీ స్ట్రీమింగ్ కానుండగా.. ఇటీవల రిలీజైన టీజర్ ఆకట్టుకుంటోంది.

Advertisement

Next Story