- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ ఆశీర్వాదంతో బాగానే ఉన్నా : రవి కృష్ణ
‘ఆమె కథ’ సీరియల్ హీరోయిన్ నవ్య స్వామికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ సీరియల్ హీరో రవి కృష్ణ కూడా కరోనా బారిన పడ్డారు. కాగా దీనిపై స్పందించిన రవి.. తను మూడు రోజులుగా ఐసోలేషన్‌లో ఉన్నానని.. దేవుడి దయ, అభిమానుల ప్రేమ, ఆశీర్వాదంతో ఇప్పుడు కరోనా లక్షణాలేవీ లేవని తెలిపారు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన.. తనతో కాంటాక్ట్‌లో ఉన్న అందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు వహిస్తూ.. సరైన డైట్ తీసుకుంటూ కరోనా మహమ్మారి నుంచి బయటపడాలని కోరారు. అంతేకాదు కరోనా వచ్చిన వారిని విమర్శించడం, తక్కువ చేసి మాట్లాడడం లాంటివి చేయరాదన్న రవి.. కరోనా పేషెంట్స్ మెంటల్ హెల్త్ స్ట్రాంగ్‌గా ఉండాలన్నారు. అప్పుడే త్వరగా రికవరీ అవుతామని, ముఖ్యంగా నెగెటివిటీకి దూరంగా ఉండాలని సూచించారు.
బిగ్ బాస్ 3 సీజన్‌తో మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న రవికృష్ణ.. వెంటనే ‘ఆమె కథ’ సీరియల్‌తో బుల్లి తెర ప్రేక్షకులను అలరించగా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. కాగా తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అభిమానులు కొంత ఆందోళన చెందినా.. రవికృష్ణ మెసేజ్‌తో కూల్ అయిపోయారు.