- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాకు, జబర్దస్త్ సంబంధం ఉందా? : రష్మి గౌతమ్
దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ రష్మీ గౌతమ్.. తనపై అనవసర విమర్శలకు దిగుతున్నవారికి క్లాస్ పీకింది. కరోనా వైరస్, జబర్ధస్త్ ప్రోగ్రాంలను ముడిపెడుతూ మాట్లాడుతున్న వారు ఎవరైతే ఉన్నారో.. ముందు ఆలోచించడం నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. మేమేమీ మీ కాళ్లు చేతులు కట్టేసి మా షో చూడాలని చెప్పడం లేదే .. మేము డ్యాన్స్ చేసినప్పుడు మీరు కళ్లు మూసుకోవచ్చు లేదా మీ చానల్ మార్చుకోవచ్చన్నారు. ఇక్కడ షో హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ఆడియన్స్ మాత్రమే అని.. వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. కానీ ఎవరికైతో షో గురించి ఇష్యూస్ ఉన్నాయో వాళ్లు నేను పైన చెప్పిన సలహాను పాటించొచ్చని సూచించారు. మీరు నా సినిమాను నిర్మించనంత వరకు నేను సతి సావిత్రి లాంటి రోల్ చేయాలని చెప్పే హక్కు మీకు లేదన్నారు. నేను ఎలాంటి చిత్రాలు చేస్తున్నాను అనే ప్రశ్న వేయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. మీరు ఎలాగైతే మీ దగ్గరికి వచ్చిన అవకాశాల్లో బెస్ట్ ఎంచుకుని పని చేస్తారో.. నేను కూడా అంతే అని స్పష్టం చేశారు రష్మి.
కరోనా ప్రభావం దృష్ట్యా ఫ్రాన్స్‌లో అద్దె, గ్యాస్, నీటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రష్మి.. మనం ఇలా చేయగలమా? అని ప్రశ్నించింది. దీనిపై ఓ నెటిజన్.. కరోనా కారణంగా అద్దె, బిల్లు గ్యాస్ బిల్లేమో కానీ… ముందుగా జబర్ధస్త్ షోను బ్యాన్ చేయండి. ఆ యాంకర్లు, వారి ఓవరాక్షన్ చూడలేకపోతున్నాము అంటూ కామెంట్ చేశాడు. దీంతో రష్మి కరోనా వైరస్, జబర్ధస్త్‌కు ముడిపెట్టడం సరికాదని క్లాస్ ఇచ్చింది.
tags : Rashmi Gautam, Coronavirus, Jabardasth, Netizens