ప్రపంచ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి: రషీద్ ఖాన్

by Shiva |
ప్రపంచ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి: రషీద్ ఖాన్
X

దిశ, స్పోర్ట్స్: ఆఫ్గానిస్తాన్ వంటి చిన్న దేశం తరఫున ఆడుతున్నా, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బౌలర్ రషీద్ ఖాన్. ఐపీఎల్, బీబీఎల్‌లలో మిస్టరీ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రషీద్ టీ20 క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. ఇప్పటికే టీ20 క్రికెట్‌లో 290 వికెట్లు పడగొట్టి అప్గాన్ తరఫున ఈ ఘనతను అందుకున్న ఏకైక క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. కాగా, అప్గాన్ జట్టులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనిపించుకున్న రషీద్‌ను పెళ్లెప్పుడు చేసుకుంటావని ఒక రేడియో ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. ‘ఆఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాతనే నా పెళ్లి’ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రషీద్ 2019 ప్రపంచకప్‌లో అఫ్గాన్ తరఫున బరిలోకి దిగాడు. అయితే, అఫ్గాన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇక కరోనా పుణ్యమా ఇంటికే పరిమితమైన రషీద్ ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతను ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Advertisement

Next Story