- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సంస్కారంతోనే రేప్‌లను ఆపొచ్చు
by Shamantha N |

X
న్యూఢిల్లీ: లైంగికదాడులను ఆపడం సంస్కారంతోనే సాధ్యమని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అన్నారు. సంస్కృతి, విలువులతోనే రేప్‌లను ఆపవచ్చునని, పాలన, హింసతో ఆపలేమని వివరించారు. హాథ్రస్ ఘటనపై యోగి ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో యూపీలోని బైరియా నియోజకవర్గ ఎమ్మెల్యే సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి ఆస్కారమిచ్చేవిగా ఉన్నాయి.
యూపీలో రామరాజ్యం, ఆటవిక పాలన సాగుతున్నదని శివసేన విమర్శలపై ఆయన స్పందిస్తూ, ‘నేనొక చట్టసభ్యుడి కంటే ముందు ఒక ఉపాధ్యాయుడిని. అలాంటి ఘటనలను కేవలం మంచి విలువలతోనే ఆపగలం. పాలన, హింస, కత్తులతో ఆపలేం. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఆడపిల్లలకు మంచి విలువలు నేర్పాలి. ప్రభుత్వం, మంచి విలువలు రెండూ ఉంటేనే దేశంలో అఘాయిత్యాలను నిలువరించగలం’ అంటూ వ్యాఖ్యానించారు.
Next Story