- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నల్లమలలో దారుణం.. వివాహితపై అత్యాచారం

దిశ, అచ్చంపేట: మహిళలపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయి. సైదాబాద్‌లో చిన్నారి హత్యాచార ఘటన మరువకముందే మరో రెండు చోట్ల దారుణాలు జరిగి, తెలంగాణలో కలకలం సృష్టించాయి. తాజాగా.. నిద్రిస్తున్న వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం సార్లపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. సార్లపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఓ గృహిణి ఇంట్లో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి వచ్చాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను గమనించి అత్యాచారానికి ఒడిగట్టాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా నాటుసారా అమ్మకాలు జరుగుతుండటంతోనే ఈ దారుణాలు పెరిగిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. అత్యాచార ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి తెలిపారు.