- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చిన్నారిపై దారుణం: టైమ్‌కి నాన్న రాకుంటే..!
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడలో దారుణం జరిగింది. ఎనిమిది సంవత్సరాల బాలికపై 20 సంవత్సరాల కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం సిగ్గు పడే ఈ ఘటన కుడకుడలో రెండు రోజుల క్రితం జరిగింది.
ఇంటి పక్కనే ఉండే ఓ మానవ మృగం చిన్న పిల్ల అని కూడా చూడకుండా నోట్లో గుడ్డలు కుక్కి దారుణానికి ఒడిగట్టాడు. అదే సమయంలో అమ్మాయి తండ్రి ఇంటికి రావడంతో నిందితుడు పరారయ్యాడని కుటుంబం సభ్యులు తెలిపారు.
జరిగిన ఘటనపై ఒక రోజంతా కుమిలిపోయిన కుటుంభసభ్యులు వైద్య పరీక్షల నిమిత్తం లేడీ డాక్టర్ ని సంప్రదించారు. ఆమె సూచనల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Next Story