ఇంటర్నేషనల్ ఆర్టిస్టులతో బాలీవుడ్ హీరో ‘సర్కస్’ ఫైట్

by Shyam |
Ranveer Singh
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రేక్షకులకు చివరగా ‘ఘూంకేటు’ చిత్రంలో కనిపించాడు. గతేడాది కొవిడ్ వల్ల రిలీజ్ కాకుండా వాయిదాపడ్డ ఆయన నటించిన చిత్రాలు కొన్ని ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు ‘జయేష్ భోరి జోర్దార్’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా.. ‘సూర్యవంశి, 83’ సినిమాల షూటింగ్స్ దాదాపు పూర్తికావొచ్చాయి. కాగా ఈ షూటింగ్స్‌కు హాజరవుతూనే ప్యారలల్‌గా ‘సర్కస్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు రణ్‌వీర్. రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో రణ్‌వీర్ భార్య దీపికా పదుకొనే స్పెషల్ కేమియో అప్పియరెన్స్ ఇవ్వబోతుంది. రోహిత్-రణ్‌వీర్ కాంబోలో ఇది వరకు ‘సింబా’ చిత్రం రాగా, ఈ సినిమా పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘టెంపర్‌’కు రీమేక్. ‘సర్కస్’లో యాక్షన్ సన్నివేశాలను ఇంటర్నేషనల్ ఆర్టస్టులతో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన రోహిత్ శెట్టి.. ఇందుకోసం స్పెషల్ సెట్స్ వేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story