గుడ్ న్యూస్ చెప్పిన రణ్‌వీర్.. అదేనా సంగతి అంటున్న ఫ్యాన్స్..

by Shyam |
ran veer
X

దిశ, సినిమా: హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో రణ్‌వీర్ సింగ్ ఒకరు. ప్రముఖ టెలివిజన్ షో ‘ది బిగ్ పిక్చర్’కి హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆయన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘సర్కస్’ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్‌ ఖాతాలో చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తూ..‘ఎక్స్‌‌క్లూజివ్ ‘సర్కస్’ 2022 జూలై 15న మీ ముందుకు రాబోతోంది’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్ ద్విపాత్రాభినయం చేయనుండగా.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇక ఈ మూవీ 1982లో విడుదలైన ‘అంగూర్’ చిత్ర కొనసాగింపు కాగా.. షేక్స్‌పియర్ ‘ది కామెడీ ఎర్రర్స్‌’ ఆధారంగా దర్శకుడు రోహిత్ శెట్టి మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అలాగే గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో కత్రీనా కైఫ్, ఇషాన్ సిద్ధాంత్ చతుర్వేది నటించిన హారర్ కామెడీ మూవీ ‘ఫోన్ భూత్’ కూడా వచ్చే ఏడాది జులై 15నే విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed