- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాణి ముఖర్జీ ‘హేరామ్’ అనుభవాలు
హేరామ్ మూవీకి 20 ఏళ్లు. కమల్ హాసన్ నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది రాణి ముఖర్జీ. ఈ సందర్భంగా సినిమా అనుభవాలను ఆమె పంచుకున్నారు. కమల్ హాసన్ పర్ ఫార్మెన్స్, యాక్టింగ్ స్కిల్స్ చూసి ఆశ్చర్యం వేసేదని తెలిపారు. ఆయన డైరెక్షన్‌లో సినిమా చేయడాన్ని అదృష్టంగా భావించానని.. అందుకోసం తొలిసారి చెన్నై వెళ్లానని చెప్పారు.
ఆ సమయంలో షూటింగ్ స్పాట్‌లో క్రమశిక్షణను చూస్తే చాలా కొత్తగా అనిపించిందన్నారు. ఒక బెల్ మోగగానే వర్క్ స్టార్ట్ అయ్యేది అని… మళ్లీ బెల్ మోగగానే ప్యాకప్ చెప్పే వారని గుర్తు చేసుకున్నారు. అంతకు ఒక్క క్షణం ముందు ఏ ఒక్కరూ కూడా షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వెళ్లే ఆలోచనే చేసేవారు కాదని తన అనుభవాన్ని పంచుకున్నారు. కమల్ హాసన్ సెట్‌లో ఉన్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తారని చెప్పిన రాణి ముఖర్జీ…. ఆయన ద్వారా చాలా నేర్చుకున్నానని తెలిపారు.
ఫస్ట్ డే షూటింగ్ హాజరైన రోజు నేను వెళ్లగానే గమనించిన కమల్ హాసన్… వెంటనే మొహం కడుక్కుని రమ్మన్నారని.. నేను అలాగే చేశాను అని అన్నారు. కానీ తాను పూర్తిగా మేకప్ తీసేసి వచ్చే దాక ఫేస్ వాష్ చేసుకోమన్నారని తెలిపింది. అప్పుడు నాకు పెద్ద బొట్టు, కాటుక పెట్టి… నా అపర్ణ రెడీ అంటూ నేను చేయబోయే పాత్ర గురించి చెప్పారన్నారు. అప్పుడే చెప్పారు ఒక నటికి, నటుడికి మేకప్‌తో ఎలాంటి అవసరం లేదని.. లైటింగ్, కెమెరా లెన్సెస్ మీద మన అందం ఆధారపడి ఉంటుందని వివరించారంది. కమల్ జీ అలా చెప్పడంతో చాలా ధైర్యం వచ్చిందన్నారు.
ఇక తాను హైట్ గురించి బాధపడుతుంటే కూడా కమల్ హాసన్ చాలా గొప్ప లైన్స్ చెప్పారన్నారు రాణి ముఖర్జీ. నీ హైట్ నువ్వేంటి అనేది డిసైడ్ చేయదు… నువ్వు సాధించే విజయాలే నువ్వు ఎవరు అనేది నిర్ణయిస్తాయని నాలో విశ్వాసాన్నినింపారన్నారు. అప్పటి నుంచి నేను పొట్టిగా ఉన్నందుకు ఎప్పుడు కూడా బాధపడలేదన్నారు రాణి ముఖర్జీ. కమల్ హాసన్‌తో పనిచేసిన అనుభవం నా కెరియర్‌కు చాలా ఉపయోగపడిందని తెలిపారు.